Ukraine apologizes : "క్షమించండి.. భారత సంస్కృతిపై గౌరవం ఉంది"

భారత సంస్కృతిని కించపరిచినందుకు ఉక్రెయిన్ క్షమాపణలు చెప్పింది. ఇందుకుగాను ఉక్రెయిన్ విదేశాంగమంత్రి ఎమిన్ ఘపరోవా ట్వీట్ చేశారు. కాళీ దేవత ఫొటోను అనుచితంగా చిత్రించినందుకు క్షమాపణలు చెప్పారు. ఆదేశపు రక్షణ మంత్రిత్వశాఖ కాళీదేవతను వక్రీకరించినందుకు పశ్చాత్తాపపడుతున్నామన్నారు. "మేము భారతీయ సంస్కృతిని గౌరవిస్తున్నాం. భారత్ నుంచి మద్దతులభిస్తున్నందుకు సంతోషం." అని ఘపరోవ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి చేసిన ట్వీట్ పై ఫైర్ అయ్యారు. ఊహించని నిరసన వెలువడటంతో ఉక్రెయిన్ డిఫెన్స్ అధికారిక ట్విట్టర్ ఎకౌంట్ నుంచి కాళీ దేవి ఫొటోను తొలగించారు. తొలగించబడిన కాళీమాత ఫొటో పేలుడులోనుంచి ఏర్పడిన పొగను గౌనులాగ చిత్రించి గౌను పైకి ఎగురుతుంటే కాళీకాదేవి ఆగౌనును పట్టుకున్నట్లుగా ఉంది. భారతదేశంనుంచి సహాయం కోరిన కొన్ని రోజులకే ఉక్రెయిన్ ఈ ఘటనకు పాల్పడింది.
ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ పై రష్యా యుద్దం ప్రారంభించినప్పటినుంచి భారత్ ను సందర్శించిన మొదటి ఉన్నత స్థాయి ఉక్రెయిన్ అధికారి ఎమిన్ ఘపరో. ఆమె సందర్శిచి వెళ్లిన తర్వాత ఉక్రెయిన్ డిఫెన్స్ ట్విట్టర్ ఎకౌంట్ నుంచి ఊహించని ట్వీట్ భారతీయ సంస్కృతిని అవమాన పరిచేవిధంగా ఉంది. ఈ విషయంపై భారత విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది. చివరికి ఉక్రెయిన్ తన తప్పును ఒప్పుకోక తప్పలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com