ఆధిపత్య పోరులో సూడాన్ అతలాకుతలం

ఆధిపత్య పోరులో సూడాన్  అతలాకుతలం
X
సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య ఆధిపత్య పోరుతో సూడాన్ అతలాకుతలమవుతోంది. స్థానికంగా భారీ స్థాయిలో ఘర్షణలు, దాడులు జరుగుతుండటంతో పెద్దఎత్తున సూడాన్‌వాసులు దేశాన్ని వీడుతున్నారు

సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య ఆధిపత్య పోరుతో సూడాన్ అతలాకుతలమవుతోంది. స్థానికంగా భారీ స్థాయిలో ఘర్షణలు, దాడులు జరుగుతుండటంతో పెద్దఎత్తున సూడాన్‌వాసులు దేశాన్ని వీడుతున్నారు. ఘర్షణలు మొదలైన ఏప్రిల్‌ 15నుంచి ఇప్పటివరకు లక్ష మందికిపైగా పౌరులు సూడాన్‌ను వీడినట్లు ఐరాస తాజాగా వెల్లడించింది. మరో 3.30 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపింది. పోరాటాన్ని తక్షణమే ముగించని పక్షంలో ఈ మానవతా సంక్షోభం.. పూర్తిస్థాయి విపత్తుకు దారితీస్తుందని హెచ్చరించింది. మరోవైపు, ఈ హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటివరకు 500 మందికిపైగా మృతిచెందారు. మరో నాలుగు వేల మందికి పైగా గాయపడ్డారు.

Tags

Next Story