ఇండోనేసియాను వణికిస్తున్న వరదలు

ఇండోనేసియాను వణికిస్తున్న వరదలు
తూర్పు తైమూర్‌లో కురిసిన వర్షాలకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు

ఇండోనేసియాను వరదల వణికిస్తున్నాయి. తుపాన్ బీభత్సం కారణంగా ఇప్పటి వరకు వంద మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. తూర్పు తైమూర్‌, ఇండోనేసియా దీవుల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరద ఉద్ధృతికి వంతెనలు, రోడ్లు తెగిపోయాయి. కొండ చరియలు విరిగిపడటంతో నివాస ప్రాంతాలు కూలిపోయాయి. ఇళ్లు ధ్వంసం కావడంతో 73 మంది మరణించారని అధికారులు తెలిపారు. వరద తీవ్రత కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రవాణా వ్యవస్థ స్థంభించడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడింది.

తూర్పు తైమూర్‌లో కురిసిన వర్షాలకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు నుసా తెంగ్గారా ప్రావిన్స్‌లోని అడొనరా ద్వీపంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. తుపాను ధాటికి పశ్చిమ నుసా తెంగ్గారాలో ఇద్దరు, మరికొన్ని చోట్ల మరో 33 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. తూర్పు నుసా తెంగ్గారాలోని ఇలి లెవొటోలోక్‌ ద్వీపంలో అగ్నిపర్వతం నుంచి సమీప గ్రామాలకు లావా ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా లావా ఘనీభవించి ప్రవహిస్తుండటంతో ... దీని కింద చిక్కుకొని 42 మంది సజీవ సమాధి అయినట్లు అధికారులు తెలిపారు. రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది.. రెస్క్యూ ఆపరేషన్ ను ముమ్మరంచేశారు. వేలాదిమందిని సహాయక శిబిరాలకు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story