US Borders : అమెరికాలో సరిహద్దుల్లో పట్టుబడ్డ 10వేల మంది ఇండియన్స్

అమెరికా సరిహద్దుల్లో భారీగా అక్రమ చొరబాటు దారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది 10,382 మంది భారతీయులు అరెస్ట్ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అయితే గతంతో పోలిస్తే భారతీయుల అక్రమ చొరబాట్లు తగ్గాయి. అక్రమ వలసలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ లెక్కల ప్రకారం.. 2024 ఏప్రిల్ నాటికి అమెరికాలో ఎలాంటి చట్టబద్ధ పత్రాలు లేకుండా నివసిస్తున్న భారతీయుల సంఖ్య 2.2 లక్షలకు చేరింది. ఇప్పటికే 332 మందిని అమెరికా అధికారులు స్వదేశానికి తిరిగి పంపారు.
అక్రమ రవాణాదారుల మాటలు నమ్మి ప్రమాదకరమైన మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించేందుకు భారతీయులు యత్నిస్తున్నారు. చివరకు అక్కడి అధికారులకు చిక్కి కటకటాలపాలవుతున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయడంతో గణనీయంగా అక్రమ వలసదారుల అరెస్టులు గణనీయంగా పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో అక్రమంగా ప్రవేశించే ప్రయత్నంలో 34,535 మంది భారతీయులు పట్టుబడ్డారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com