1000ఏళ్ల తర్వాత అక్కడ భారీ వర్షం.. వరదల్లో కొట్టుకుపోయిన కార్లు..!

హెనన్ ప్రావిన్స్‌లో భారీ వర్షం కురిసింది. ఎంతలా అంటే 1000ఏళ్లలో ఇదే భారీ వర్షం కావడం విశేషం. ఈ భారీ వర్షం వలన ప్రావిన్స్‌లోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ వరదల్లో ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్టుగా అధికారులు వెల్లడించారు. లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించినట్టుగా వెల్లడించారు. ప్రావిన్స్ రాజధాని జెంగ్జౌలో మంగళవారం ఒక్కరోజే 457.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 1000ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదు అవ్వడం ఇదే మొదటిసారి అని అక్కడి అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో ఈ ప్రావిన్స్‌ను ఆనుకుని ఉన్న ఎల్లో నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనితో అక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. విధులన్నీ నదులలాగా దర్శనం ఇస్తున్నాయి. ఇక వాహనాలు అయితే వరదల్లో కొట్టుకుపోయాయి.. ఇక రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బస్సు, రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. 250కి పైగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
Central #China's Henan Province is experiencing floods after being hit by record heavy rains since last Saturday. 5 national meteorological stations broke the historical precipitation record for 3 consecutive days. pic.twitter.com/SggSUoewad
— Rita Bai (@RitaBai) July 20, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com