Sri Lanka Navy : శ్రీలంక నేవీ అదుపులో 12 మంది జాలర్లు

Sri Lanka Navy : శ్రీలంక నేవీ అదుపులో 12 మంది జాలర్లు
X

తమిళనాడులోని నాగపట్నం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులను నవంబర్ 11న శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకుంది. తమ ద్వీప జలాల్లోకి చొరబడి చేపలు పట్టినందుకు వారిని అరెస్టు చేసినట్లు మత్స్యశాఖ అధికారి మంగళవారం తెలిపారు. లంక నావికాదళం అరెస్టు చేసిన నాగ పట్నం మత్స్య కారులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని రామేశ్వ రంలో బాధిత కుటుం బాలు నిరసన ప్రదర్శన చేపట్టారు. తమిళనాడు మత్స్యకారులను తరుచూ అరెస్టులు చేయడం, చేపల వేట పడవల్ని సీజ్ చేయడం వంటి చర్యల్ని నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మత్స్యశాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, నాగ పట్నం మత్స్యకారులు నవంబర్ 10 రాత్రి అక్కరైపేట ఫిషింగ్ హార్బర్ నుండి మెకనైజ్డ్ క్రాఫ్ట్ లో బయలు దేరారు. నవంబర్ 11 సాయంత్రం కొడి యాకరైకి ఆగ్నేయ ప్రాంతంలో శ్రీలంక నావికాదళం వారిని అదుపులోకి తీసుకుంది. దేశంలోని మత్స్యకారుల అరెస్టు లను నిరోధించేందుకు, వారి బోట్లను త్వరిత గతిన విడుదల చేసేందుకు వెంటనే దౌత్య పరమైన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ను అభ్యర్థించారు. ఈ మేర కు జైశంకర్కు స్టాలిన్ లేఖ రాశారు. గత ఏడేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా 2024లో మత్స్యకారులను లంక బలగాలు అదుపులోకి తీసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయని స్టాలిన్ వివరించారు.

Tags

Next Story