Pakisthan : మసూద్ అజార్ కు 14 కోట్ల నష్ట పరిహారం?

ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలను భారత సేనలు కూల్చేశాయి. 9 స్థావరాలపై చేసిన దాడుల్లో అనేక మంది టెర్రరిస్టులు చనిపోయారు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీలోని 14 మంది కూడా హతమయ్యారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా జరిగిన నష్టంపై ఓ ప్రకటన చేశారు. దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని వెల్లడించారు. దీంతో తన కుటుంబంలో 14 మందిని కోల్పోయిన జేషే చీఫ్ మసూద్ అజార్ కు రూ.14 కోట్లు దక్కే చాన్స్ ఉంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా బహవల్ పుర్ లో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడి చేసి చంపేసింది. లాహోర్కు సుమారు 400కి లోమీటర్ల దూరంలో బహవల్పుర పట్టణంలో నే జైషే ప్రధాన కార్యాలయం ఉంది. జామియా మజ్జీద్ సుభాన్ అల్లా లేదా ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ అని కూడా దీన్ని పిలుస్తుంటారు.ఆప రేషన్ సింధూర్లో భాగంగా బహవల్పుర్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడి చేసి చంపేసింది. సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో తన సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, మేనల్లుడి భార్య, మరదలు, మరో ఐదుగురు చిన్నారులు చనిపోయినట్లు మసూద్ అజార్ ప్రకటించా రు. మొత్తం ఫ్యామిలీలో ఆయనొక్కడే బతికి ఉన్నాడు. చనిపోయిన వారందరికి మసూద్ వారసుడు కాబట్టి అతడికి పాక్ సర్కార్ ఇచ్చే 14 కోట్లు దక్కనున్నాయని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com