Israel : గాజాలో 14 మంది పాలస్తీనియన్లు మృతి

Israel : గాజాలో 14 మంది పాలస్తీనియన్లు మృతి
X

గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా జరిగిన రెండు వేర్వేరుదాడుల్లో 14 మంది పాలస్తీనియన్లు మరణించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నట్లు పాలస్తీనా వైద్య అధి కారులు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రకటించిన మానవతా జోన్ లో ఎక్కువ మంది మరణించారని పేర్కొన్నారు. మానవతా జోన్ అని పిలవబడే మువాసిలో స్థానభ్రంశం చెందిన పౌరులు ఉపయోగించే తాత్కాలిక టిఫిన్ సెంటర్ పై సోమవారం అర్ధరాత్రి ఈ దాడి జరిగింది. నాసర్ ఆసుపత్రి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు చిన్నారులతో సహా కనీసం 14 మంది మరణించారు. ముడతలు పెట్టిన లోహపు షీట్లతో చేసిన ఎన్ క్లోజర్లో ఇసుకలో ఏర్పాటు చేసిన టేబుళ్లు, కుర్చీల మధ్య నుండి గాయపడిన వారిని బయటకు లాగుతున్నట్లు వీడియోలో కనిపించింది.

Tags

Next Story