U.S. : అమెరిలో అక్రమంగా వలస .. 205 మంది ఇండియన్లు ఇంటికి!

U.S. : అమెరిలో అక్రమంగా వలస .. 205 మంది ఇండియన్లు ఇంటికి!
X

అమెరిలో అక్రమంగా వలస ఉంటున్న 205 మంది భారతీయుల ను తిప్పి పంపారు. యుద్ధ ఖైదీల మాదిరిగా యూఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో అక్రమ వలసదారులుగా గుర్తించిన ఇండియన్స్ ను తిరిగి పంపించారు. టెక్సాస్ నుంచి బయ లుదేరిన విమానం ఇవాళ ఇండియాకు చేరుకుంటుంది. తమను యుద్ధ ఖైదీల్లాగ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో తరలించడంపై తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు ఇండి యన్స్. ఆగమేఘాల మీద అత్యవసరంగా తీసుకురావడంపై ఆందోళన చెందుతు న్నారు. ట్రంప్ నిర్ణయంపై అధికారికంగా యూఎస్ లో ఉంటున్న భారతీయులు కూడా ఆందోళన చెందుతున్నారు. భా రతీయులను వెనక్కి తీసుకురావడంలో విదేశాంగ శాఖ చొరవ తీసుకున్నట్టు సమాచారం. గతంలో గ్వాటెమాల, పెరూ, హొండూరస్ వలసదారులను పంపించిన ట్రంప్, ఇప్పుడు భారతీయులను వెనక్కి పంపడం ప్రారంభించారు. మొత్తం 18 వేల మంది భారతీయులు అక్రమంగా అమె రికాలో నివాసం ఉంటున్నట్టు అధికారులు గుర్తించారు. మిగతా వారిని కూడా దఫద ఫాలుగా ఇండియాకు తిప్పి పంపనున్నారు.

Tags

Next Story