Los Angeles Wildfire : లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో 24 మంది మృతి..

లాస్ ఏంజిల్స్ నగరం కార్చిచ్చు కారణంగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మృతి చెందినట్టు వార్తలో స్తున్నాయి. డజన్ల సంఖ్యలో మంది మిస్సయ్యమా రని తెలుస్తోంది. హాలీవుడ్ తారలు నివసించే ఈ నగరంలో ఎక్కువ భాగం బూడిదైంది. మంటలు ఆరిపోయిన ప్రదేశాలు గులాబీ రంగులోకి మారాయి. అగ్నికీలల వ్యాప్తిని నెమ్మదింపజేయ డానికి కొన్ని రసాయనాలు కలిపిన ఫోస్ చెక్ అనే మిశ్రమాన్ని దాదాపు 9 విమానాలు, 20 హెలికాఫ్ట ర్ల సాయంతో నగరంపై వెదజల్లుతున్నారు. పింక్ రంగులో ఉన్న ఆ పదార్థం అక్కడి నిర్మాణాలు, మొక్కలపైనా అవి పడి అగ్నికీలల వ్యాప్తిని నెమ్మ దింపజేస్తుంది. దీనిలోని అమ్మోనియం పాలీపాస్ఫే ట్ అంతవేగంగా ఆవిరి కాదు. దేనిమీదైనా పడితే సుదీర్ఘకాలం ఉండిపోతుంది. ఇది వృక్షాలపై పడి అగ్నికి ఆక్సిజన్ అందకుండా చేయడంతో అవి వేగంగా వ్యాపించలేవు. లాస్ ఏంజెలెస్లో అతిపెద్దదైన పాలిసేడ్స్ ఫైర్ కారణం న్యూఇయర్ వేడుకలని అనుమానిస్తు న్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కాల్చిన టపాసులతో అంటుకొని అక్కడ అగ్నిప్రమాదం జరిగింది. దానిని ఆర్పినా.. మిగిలిన నిప్పునకు బలమైన గాలులు తోడు కావడంతో కార్చిచ్చు రా జుకొన్నట్లు అనుమానిస్తున్నారని వాషింగ్టన్ పోస్టు కథనంలో పేర్కొంది. ఉపగ్రహ చిత్రాలు, రేడియో కమ్యూనికేషన్లు, స్థానికులను ఇంటర్వ్యూ చేసిన అనంతరం పాలిసేడ్స్ ఫైర్ అక్కడే మొదలైందని ఆ పత్రిక చెబుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com