France : 299 మంది రోగులపై అత్యాచారం

ఫ్రాన్స్ లో ఓ వైద్యుడు వందలాది అరాచకాలకు పాల్పడ్డాడు. తన ముప్పై ఏళ్ల సర్వీసులో రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్ వారిపైనే అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఇలా తన సర్వీసులో ఏకంగా 299 మందిపై అఘాయిత్యం చేశాడు. వీరిలో ఎక్కువమంది చిన్నారులే కావడం విచారకరం. అబ్బాయిలు కూడా ఉండటం నిర్ఘాంత పరిచే అంశం. ఈ వ్యవహారంలో 74 ఏళ్ల జోయెల్ లి స్కౌర్నెక్పై ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటు న్నాడు. జోయల్ ఫ్రాన్స్లోని బ్రిటానీ అనే ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో సర్జన్ గా పనిచేసేవాడు. రోగులు మత్తులో ఉండగా వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ వ్యవహారం 2017లోనే వెలుగులోకి వచ్చింది. తన పొరుగింటిలో ఆరేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడంతో కేసు నమోదైంది. విచారణలో భాగంగా అతడి ఇంటికి వెళ్లిన పోలీసులకు 3 లక్షలకుపైగా యువతుల ఫొటోలు, 650కిపైగా అశ్లీల వీడియోలు గుర్తించి అవాక్కయ్యారు. చిన్నారులు, జంతువులతో శృంగార కార్యకలాపాలు నెరుపుతున్నట్లు అతడి డైరీలలో వెల్లడైంది. ఎప్పుడు ఎక్కడ.. ఎవరిపై అత్యాచారం చేశాడో డైరీల్లో వివరంగా రాసుకున్నాడు. 2020లో కోర్టు జోయెల్న దోషిగా తేల్చింది. 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది. 1989 నుంచి 2014 మధ్య కాలంలో 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడినట్లు అతడు కోర్టులో అంగీకరించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com