Bangladesh : బంగ్లాదేశ్‌లో 21 రోజుల్లో 440 మంది మృతి

Bangladesh : బంగ్లాదేశ్‌లో 21 రోజుల్లో 440 మంది మృతి

ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుతోంది. వేలాది మంది నిరసనకారులు ఆందోళన చేపట్టారు. రాజధాని ఢాకా సహా అనేక నగరాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ నిరసనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. జులై 16 నుంచి ఆగస్ట్ 6 వరకు 21 రోజుల్లో జరిగిన అల్లర్లలో మొత్తం మరణాల సంఖ్య 440 దాటినట్టు వెల్లడించింది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య దాదాపు 37 మృతదేహాలను ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఈ ఘర్షణల్లో బుల్లెట్ సహా వివిధ గాయాలతో సుమారు 500 మంది ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపింది. మరోవైపు ఆందోళనల మాటున హిందూ ఆలయాలపై దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా ఖుల్నా డివిజన్లోని మెహరూర్లో ఉన్న ఇస్కాన్ టెంపులపై దాడిచేశారు. ఆలయాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాలను పగులగొట్టారు.

Tags

Next Story