దుబాయ్‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. 300 మందికి పైగా రక్తదానం..!
దుబాయ్: స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృత మహోత్సవ వేడుకలు ప్రపంచమంతటా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.దుబాయ్ లోని భారత అసోసియేషన్ 'FOI ఈవెంట్స్' వారు దుబాయ్ హెల్త్ అథారిటీ మరియు భారత కాన్సులేట్ తో కలిసి రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ నుండి తాడు మేము(కాన్సుల్ లేబర్), రాము(కాన్సుల్ పాస్పోర్ట్) ముఖ్యఅథిధులుగా విచ్చేసారు.మోహన్ నర్సింహా మూర్తి(ఫౌండర్ FOI ఈవెంట్స్) మాట్లాడుతూ..బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో 300 మందికి పైగా పాల్గొన్నారని తెలిపారు.దుబాయ్ హెల్త్ అథారిటీ మరియు ఇండియన్ కాన్సులేట్ నుండి తమకు ఎల్లప్పుడూ మద్దతు లభిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన నరేష్ కుమార్ మాన్యం,రమేష్ పాత,చిట్యాల హరీష్,రుద్రపల్లి తిరుపతి,పెరిక సురేష్,దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,కుంభాల మహేందర్ రెడ్డి,నవనీత్,గుండెల్లి నర్సింహులు,శరత్,ఆనంద్ కందూరి,రాజేష్, సత్యనారాయణ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com