KTR : లండన్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం

KTR : లండన్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం
X

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, రజతోత్సవ దినోత్సవ వేడుకలకు లండన్ పర్యటనకు వెళ్ళిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ ఎన్.ఆర్.ఐలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలకడానికి ప్రవాస తెలంగాణీయులు పెద్ద ఎత్తున ఏయిర్ పోర్టుకు తరలివచ్చారు. వెల్కం కేటీఆర్ అంటూ భారీ బ్యానర్ ను విమానాశ్రయంలో ప్రదర్శించారు. పీడీఎస్ఎల్ -ప్రగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ల బృందం, వారి కుటుంబసభ్యులు ఏయిర్ పోర్టుకు వచ్చి కేటీఆర్ కు స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని పేరుపేరునా కేటీఆర్ పలకరించారు.

ఈ సందర్భంగా ఎన్నారైలు కేటీఆర్ తో సెల్ఫీలు దిగి సంబరపడ్డారు. ఈ నెల 30న బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో లండన్ లో జరిగే ఇండియా వీక్ 2025లో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. మెక్ లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు అధు నాతన ఆర్ అండ్ డీ సేవలను అందించే పీడీఎస్ఎల్ కంపెనీ నాలెడ్జ్ సెంటరున్ను అదే రోజు వార్విక్లో కేటీఆర్ ప్రారంభి స్తారు. తనకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రవాస తెలంగాణీయులకు, పీడీఎస్ఎల్ డైరెక్టర్ల బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. లండన్ నుంచి అమెరికా వెళ్లే కేటీఆర్, అక్కడ జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.

Tags

Next Story