Japan : జపాన్‌ను వణికిస్తున్న అతిపెద్ద కార్చిచ్చు

జపాన్ ను అతిపెద్ద కార్చిచ్చు చుట్టుముట్టింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ చూడని రీతిలో దావానలం చెలరేగింది. ప్రజల ఇళ్లపై ఎటువంటి ప్రభావం ఉండకుండా చూసుకోవడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటాము అని ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా పార్లమెంటులో చెప్పారు. ఒఫునాటో నగరానికి సమీపంలో గత గురువారం మొదలైన మంటలకు దాదాపు 2,100 హెక్టార్ల అడవులు (5,200 ఎకరాలు) దగ్ధమై నట్లు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సంస్థ సోమవారం తెలిపింది. సైన్యంతో సహా 16 హెలికాప్టర్లు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ డేటా ప్రకారం, 1970లలో చెలరేగిన గరిష్ట స్థాయి దావానలం తర్వాత జపాన్లో ఇదే అతిపెద్ద అగ్ని విపత్తు అని తెలుస్తోంది. ఈ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఆ దేశ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అంచనాల ప్రకారం కార్చిచ్చును తొలుత గత బుధవారం గుర్తించారు. ఇప్పటి వరకు 84 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఆ సందర్భంలో ఓ వ్యక్తి మరణించాడు. ఆదివారం నాటికి 4,600 ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. 1200 ఇళ్లలోని వారిని అత్యవసర వసతి శిబిరాలకు తరలించారు. దాదాపు 2000 మంది సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. సహాయక చర్యలకు విమాలు కూడా రంగంలోకి దిగాయి.
అమెరికాలోని ఉత్తర, దక్షిణ కరోలినా ప్రాంతాల్లో మళ్లీ కార్చిచ్చు వ్యాపించింది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. ద. కరోలినా అటవీ సంరక్షణ విభాగం ప్రకారం అక్కడ 4.9చ.కిమీ మేరకు అటవీ భమి దగ్ధమైంది. అత్యవసర పరిస్థితిని విధించినట్లు గవర్నర్ హెన్రీ మెక్ మాస్టర్ ప్రకటించారు. మొత్తం 175 ప్రదేశాల్లో మంటలు వ్యాపిం చాయని తెలిపారు. నార్త్ కరోలినాలో కార్చిచ్చు ధాటికి 161 హెక్టార్లు బూడిదయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com