Indian Nationals Kidnapped : మాలిలో కిడ్నాప్ అయిన భారతీయుల్లో మిర్యాలగూడ వాసి

Indian Nationals Kidnapped : మాలిలో కిడ్నాప్ అయిన భారతీయుల్లో మిర్యాలగూడ వాసి
X

ఆఫ్రికా దేశమైన మాలిలో ఉగ్రవాదులు ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1న డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చిన ఉగ్రవాదులు.. అక్కడ పనిచేస్తున్న భారతీయులను బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిని తుపాకులతో బెదిరించారు. ఆల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమాన్ ఉగ్రవాదులే ఈ కిడ్నాప్ చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

కిడ్నాప్ కు గురైన వ్యక్తులను పోలీసులు గుర్తించారు. మిర్యాలగూడకు చెందిన అమరలింగేశ్వర రావు(45)తో పాటు రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ప్రకాశ్ చంద్ జోషి, ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన వెంకటరామన్‌గా అధికారులు గుర్తించారు. ఈ కిడ్నాప్‌పై మాలి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, కిడ్నాపర్ల చెర నుంచి వారిని విడిపించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Tags

Next Story