Trump : బిడ్డ పుడితే వెయ్యి డాలర్లు.. ట్రంప్ సంచలన ప్రకటన

అమెరికాలో జన్మించిన చిన్నారుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకాన్ని తెర పైకి తెచ్చారు. ఈ మేరకు 202529 మధ్య అమెరికా పౌరులకు జన్మించే ప్రతి చిన్నారి పేరిట 1,000 డాలర్ల సొమ్ముతో ఓ ఇన్వెస్ట్మెంట్ ఖాతాను ప్రభుత్వం ఉచితంగా తెరుస్తుంది. వీటిని 'ట్రంప్ ఖాతా'లుగా పిలువబోతున్నారు. 2024 జనవరి 31 తర్వాత నుంచి 2029 డిసెంబర్ 31 మధ్య జన్మించే అమెరికన్ పౌరులకు ఫెడరల్ ప్రభుత్వం ఏక మొత్తంగా 1,000 డాలర్లను ట్యాక్స్ డెఫర్డ్ ఖాతాలో జమచేస్తారని ట్రంప్ చెప్పారు. ఈ అకౌంట్లను పిల్లల పేరెంట్స్ నియంత్రిస్తారని తెలిపారు. వారు ఈ ఖాతాలో ప్రైవేటు కాంట్రిబ్యూషన్ కింద ఏటా 5,000 డాలర్ల వరకు జమచేసే అవకాశం ఉందన్నారు. ఇది భావితరాల దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేసేందుకు ఉపయోగ పడతాయని ట్రంప్ తెలిపారు. ఆ చిన్నారికి 18 ఏళ్లు నిండే వరకు వడ్డీని అందులో జమ చేస్తారు. చిన్నారి తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు వర్క్ ఆథరైజేషన్తో పాటు సోషల్ సెక్యూరిటీ నెంబర్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ బిల్లును ప్రతినిధుల సభలో ఆమోదించారు. ఇక సెనెట్లో పాస్ కావాల్సిఉంది. కానీ, అక్కడ కొంత ప్రతిఘటన ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com