Afghanistan: 71 మంది వలసదారులు సజీవహదహనం

Afghanistan: 71 మంది వలసదారులు సజీవహదహనం
X
ఆఫ్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

అఫ్గానిస్థాన్‌లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 17 మంది చిన్నారులతో సహా 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ప్రావిన్స్‌ అధికారులు బుధవారం ఎక్స్‌లో ధృవీకరించారు. ట్రక్కు, మోటార్‌ సైకిల్‌ను బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోర రోడ్డు ప్రమాదంగా అధికారులు పేర్కొన్నారు.

ఇరాన్ నుంచి బహిష్కరించబడిన అఫ్గానిస్థాన్‌లను కాబూల్ వైపు తీసుకువెళుతుండగా బస్సు ప్రమాదంకు గురైంది. ఇరాన్ సరిహద్దు దాటగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బందితో సహా స్థానికులు కూడా బస్సుకు అంటుకున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మోటార్‌ సైకిల్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది.

ప్రయాణికులందరూ ఇస్లాం ఖాలా (Islam Qala)లోని వలసదారులు (Migrants) అని ప్రాంతీయ అధికారి మొహమ్మద్ యూసుఫ్ సయీది తెలిపారు. బస్సు మంటల్లో చిక్కుకోవడంతో సమీపంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Tags

Next Story