యువగళం పాదయాత్రలో ఐటీడీపీ కొత్త కాన్సెప్ట్

యువళం పాదయాత్రలో టీడీపీ కొత్త కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది.. యువగళం పాదయాత్రను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాలో కొత్త టెక్నాలజీని జోడిస్తున్న టీడీపీ.. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్‌ను కూడా ఇంట్రడ్యూస్ చేసింది.. వైభవి పేరుతో ఐటీడీపీ పరిచయం చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ యుగవళం పాదయాత్ర షెడ్యూల్‌ను టకటకా చెప్పేస్తోంది.. లోకేష్ ఇవాళ్టి టూర్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది.. ఆయన ఏయే గ్రామాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు, ఇలాంటి అన్ని విషయాలను ఏఐ టెక్నాలజీతో సృష్టించిన కృత్రిమ యాంకర్ వైభవి వివరంగా చెప్పింది..
టీడీపీ అనుబంధ విభాగం ఐటీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కొత్త ప్రయోగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఫ్యూచర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు ఈ ప్రయోగాన్ని బట్టి తెలుస్తోంది. ఏఐ టెక్నాలజీ ద్వారా పార్టీ కార్యక్రమాలు, ప్రచారం సాగించే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.. మేనిఫెస్టో సహా పార్టీ కార్యక్రమాలు, అప్‌డేట్స్ ప్రజల్లోకి పంపేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.. ఇక రాజకీయ పార్టీల చరిత్రలో తొలి ఏఐ యాంకర్ కాన్సెప్ట్ తమదేనని టీడీపీ చెబుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com