Aircel CEO : ఎయిర్‌సెల్‌ అధినేత కన్నుమూత

Aircel CEO : ఎయిర్‌సెల్‌ అధినేత కన్నుమూత
X

ప్రముఖ పారిశ్రామికవేత్త టి.ఆనంద కృష్ణన్(86) మృతి చెందారు.ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. టెలికమ్యూనికేషన్స్ నుంచి చమురు, గ్యాస్ వరకు విభిన్న రంగాల్లో ఈయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. మలేషియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా, అక్కడ సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా ఆనంద కృష్ణన్ నిలిచారు. ఆయన మృతిని ధ్రువీకరిస్తూ మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘కార్పొరేట్ ప్రపంచానికి కృష్ణన్‌ చాలా సేవలందించారు. అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణన్ సమాజానికి చేసిన కృషి చిరస్మరణీయం’ అని ఇబ్రహీం అన్నారు.

Tags

Next Story