Americans : ట్రంప్ ను నమ్మని అమెరికన్లు

Americans : ట్రంప్ ను నమ్మని అమెరికన్లు
X

ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయాలు ప్రపంచ దేశాలను మాత్రమే కాదు... అమెరికన్లను కూడా భయపెడుతున్నాయి. అధ్యక్షుడి నిర్ణయాలతో తమ జీవితాలు ప్రభావితం అవుతున్నాయని చాలా మంది ఆందోళ చెందుతున్నారు. సుంకాలతో ప్రపంచ దేశాలను భయపెట్టి తర్వాత కాస్త వెనక్కి తగ్గి 90 రోజుల విరామం ప్రకటించినప్పటికీ ఆయన్ను సొంత దేశంలోనే మెజారిటీ ప్రజలు నమ్మడం లేదని తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆయన ని ర్ణయాలపై అభిప్రాయం తెలుసుకునేందుకు సీబీఎస్ న్యూస్ ఈ నెల 8-11 తేదీల మధ్య ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం... 75శాతం మంది ప్రజలు భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. 65శాతం మంది త్వరలోనే ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా మారుతుందని నమ్ముతుండగా, 42శాతం మంది సుదీర్ఘకాలం ఇబ్బంది తప్పదని నమ్ముతున్నారు. ట్రంప్ కు అనుకూల ప్రాంతంలోనూ ఆయన నిర్ణయాలతో తమకు ఉద్యోగాలు వస్తాయని నమ్ముతున్న వారి సంఖ్య 49శాతం మాత్రమే. 51శాతం మంది ఆయన లక్ష్యాలను ఇష్టపడగా, 63శాతం మంది ఆయన అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. మొత్తం మీద 59శాతం మంది అమెరికన్లు టారిఫ్స్ తో ఒగిగేదేమీ లేదంటున్నారు.

Tags

Next Story