Rishi Sunak: బ్రిటన్ ప్రధాని ఇజ్రాయెల్‌ పర్యటన నేడు

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని  ఇజ్రాయెల్‌ పర్యటన నేడు
ప్రధాని, అధ్యక్షులతో చర్చలు

ఇజ్రాయెల్ - పాలస్తీనా భీకర యుద్ద నేపధ్యంలో ప్రపంచ దేశాధినేతలు ఇజ్రాయెల్ కు క్యూ కడుతున్నారు. నిన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ లో పర్యటించగా ఇవాళ బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ఇ జ్రాయెల్ లో పర్యటించనున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ముందుగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తో సునక్ సమావేశమవనున్నట్లు తెలుస్తోంది.

హమాస్‌ ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌లో బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యటించిన విషయం విదితమే. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో బైడెన్ సమావేశమయ్యారు. యుద్ధ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధంతో రెండు దేశాల్లో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌ వైపు 13 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అక్కడ 3వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ భయంతో 10 లక్షలకు పైగా ప్రజలు గాజాను వీడిచి వెళ్లిపోయారు.

గాజా ఆసుపత్రిపై జరిగిన బాంబ్ దాడి ప్రమాదం అవతలి వైపు వ్యక్తుల వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. ఆయన ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం అయ్యారు. టెల్ అవీవ్ లో యుద్ధం వల్ల సంభవించిన ఆస్తి నష్టాన్ని చూశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. యుద్ధంలో దెబ్బతిన్న టెల్ అవివ్ ప్రాంతాన్ని బైడెన్ సందర్శించారు. హమాస్ 31 మంది అమెరికన్లతో సహా 13 వందల మందిని హత్య చేసిందని ఆయన ఆరోపించారు.వారు పిల్లలతో సహా అనేక మందిని బందీలుగా పట్టుకున్నారని చెప్పారు. హమాస్ పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం లేదని కొత్త చిక్కులను తీసుకువచ్చిందని ఆయన అన్నారు. తమ వెంట ఉన్నందుకు బైడెన్ కి నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు.యుద్ధసమయంలో ఇజ్రాయెల్ ని సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడు బైడెన్ అని నెతన్యాహు తెలిపారు. అది ఇజ్రాయెల్ పై అమెరికాకు ఉన్న వ్యక్తిగత నిబద్ధతను తెలియజేస్తోందని బైడెన్ అన్నారు. యూఎస్ చేస్తున్న సహాయం, అందిస్తున్న సహకారం మరువలేనిదని అభివర్ణించారు. తమను తాము రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ చేసిన కృషిని బైడెన్ మెచ్చుకున్నారు. మరోవైపు ఈ యుద్ధంతో రెండు దేశాల్లో మరణాల సంఖ్యం అంతకంతకూ పెరుగుతోంది. హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌ వైపు 1,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అక్కడ 3000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సుమారు 10 లక్షల మందికిపైగా ప్రజలు గాజాను వీడారు.


Tags

Read MoreRead Less
Next Story