Canada Prime Ministership : కెనడా ప్రధాని రేసులో అనితా ఆనంద్

Canada Prime Ministership : కెనడా ప్రధాని రేసులో అనితా ఆనంద్
X

కెనడా ప్రధానమంత్రి, లిబరల్ పార్టీ అధినేత జస్టిన్ ట్రూడో రాజీనామా నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కెనడా తదుపరి ప్రధాని ఎవరనేది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే ప్రధాని రేసులో భారత సంతతి ఎంపీ సహా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. లిబరల్ పార్టీ నేతలు క్రిస్టియా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్ తోపాటు భారత సంతతి ఎంపీ అనిత ఆనంద్ పేర్లు వినిపిస్తున్నాయి. అక్టోబరు 2025 సాధారణ ఎన్నికలకు ముందు లిబరల్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సివుంది. అనేక మంది అభ్యర్థులు నాయకత్వ రేసులోకి ప్రవేశించే అవకాశం ఉంది. భారత సంతతికి చెందిన ఎంపీ అనితా ఆనంద్.. తమిళ్, పంజాబీ మూలాలు కలిగిన నేత. ఆమె తండ్రి తమిళనాడు కాగా, తల్లిది పంజాబ్. 57 ఏళ్ల అనిత ఆనంద్ ఆక్స్ఫర్డ్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. 2019లో ఓక విల్లే నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం ఆమె ట్రూడో కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. పబ్లిక్ సర్వీసెస్, రవాణా, రక్షణ సహా పలు కీలక పదవులను చేపట్టారు.

Tags

Next Story