Donald Trump : ట్రంప్ జట్టులోకి మరో భారత సంతతి వ్యక్తి

Donald Trump : ట్రంప్ జట్టులోకి మరో భారత సంతతి వ్యక్తి
X

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్‌లోకి భారత సంతతి మహిళను ఎంపిక చేశారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన ఇండో అమెరికన్ లాయర్ హర్మిత్ థిల్లాన్‌ను మానవ హక్కుల అసిస్టెంట్ అటార్నీ జనరల్ పోస్టుకు నామినేట్ చేశారు. ఇప్పటికే ఆయన తన కార్యవర్గంలోకి భారత మూలాలున్న వివేక్ రామస్వామి, కోల్‌కతాలో జన్మించిన భట్టాచార్య, కశ్యప్ పటేల్ (కాష్ పటేల్)ను నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

ఎవరీ హర్మిత్ ధిల్లాన్..?

భారతదేశంలోని చండీగఢ్ లో జన్మించిన హర్మీత్.. చినంతనంలోనే తల్లితండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లారు. నార్త్ కరోలినా స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమిటిక్స్ లో ఉన్నత పాఠశాల విద్యను.. అనంతరం.. డార్ట్ మౌత్ కాలేజీ నుంచి క్లాసికల్ లిటరేచర్ లో బీఏ డిగ్రీని అభ్యసించారు. తర్వాత వర్జీనియా యూనివర్శిటీ నుంచి లా డిగ్రీ పొందారు.

1993లో యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది ఫోర్త్ సర్క్యూట్ లో క్లర్క్ గా చేరారు. ఆ తర్వాత 1994-1998 వరకూ షీర్మాన్ & స్టెర్లింగ్ లో అసోసియేట్ గా పనిచేశారు. ఈ క్రమంలో... 2006లో సొంతంగా ధిల్లాన్ లా గ్రూప్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. గత ఏడ్దాది రిపబ్లికన్ జాతీయ కమిటీ అధ్యక్ష పదవిలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

Tags

Next Story