New York City : న్యూయార్క్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం

New York City : న్యూయార్క్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం
X

న్యూయార్క్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మాన్‌హట్టన్‌లోని ఓ 44 అంతస్తుల కార్యాలయ భవనంలో జరిగిన ఈ భీకర కాల్పుల ఘటనలో న్యూయార్క్ పోలీస్ అధికారితో సహా ఐదుగురు మరణించారు. ఈ దాడిలో చాలా మంది గాయపడ్డారు. జూలై 28, 2025 సోమవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో (స్థానిక సమయం) మాన్‌హట్టన్‌లోని 345 పార్క్ అవెన్యూలో ఉన్న ఒక కార్యాలయ భవనంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ భవనంలో బ్లాక్‌స్టోన్, ఎన్‌ఎఫ్‌ఎల్ (నేషనల్ ఫుట్‌బాల్ లీగ్) వంటి ప్రముఖ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. 27 ఏళ్ల షేన్ తమురా అనే వ్యక్తి తన వద్ద ఉన్న రైఫిల్‌తో భవనంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (NYPD) అధికారి దిదరుల్ ఇస్లాం (36) తో సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన షేన్ తమురా కూడా తనను తాను కాల్చుకుని మరణించాడు. మరణించిన వారిలో ఒక పోలీస్ అధికారి, ముగ్గురు పౌరులు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Tags

Next Story