AP: క్వాంటమ్‌ సైన్స్‌తో జాతీయ భద్రతకు కొత్త దిశ

AP: క్వాంటమ్‌ సైన్స్‌తో జాతీయ భద్రతకు కొత్త దిశ
X
క్వాం­ట­మ్‌ కం­ప్యూ­టిం­గ్‌ రం­గం­లో ప్ర­పంచ దే­శా­ల పో­టీ

కం­ప్యూ­టిం­గ్, కమ్యూ­ని­కే­ష­న్ల, సె­న్సిం­గ్, సి­మ్యు­లే­ష­న్, ఎన్‌­క్రి­ప్ష­న్, ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­టె­లి­జె­న్స్, శా­స్త్రీయ పరి­శో­ధ­న­ల­లో వి­ప్ల­వా­త్మక మా­ర్పు­లు తీ­సు­కు­వ­చ్చే క్వాం­ట­మ్‌ కం­ప్యూ­టిం­గ్‌ రం­గం­లో ప్ర­పంచ దే­శా­లు పో­టీ­ప­డు­తు­న్నా­యి. అమె­రి­కా, చైనా ముం­దం­జ­లో ఉన్నా­యి. చైనా ఇప్ప­టి­కే క్వాం­ట­మ్‌ ఉప­గ్ర­హా­లు, భూతల క్వాం­ట­మ్‌ నె­ట్‌­వ­ర్క్‌­ను ఏర్పా­టు చే­సిం­ది. భా­ర­త్ ఇప్ప­టి­కీ RSA, ECC వంటి గూ­ఢ­లి­పి సాం­కే­తి­క­త­ల­పై ఆధా­ర­ప­డు­తోం­ద­ని, అవి క్వాం­ట­మ్‌ కం­ప్యూ­ట­ర్ల చేత సు­ల­భం­గా ఛే­దిం­చ­బ­డే అవ­కా­శం ఉంది. ఈ కో­డ్‌­ల­పై భా­ర­త­దే­శ­పు రక్షణ, మౌ­లిక వస­తు­లు, న్యు­క్లి­య­ర్ ని­యం­త్రణ, ఆర్థిక వ్య­వ­స్థ, డి­జి­ట­ల్‌ గు­ర్తిం­పు, కమ్యూ­ని­కే­ష­న్లు ఆధా­ర­ప­డ­డం దేశ భద్ర­త­కు కీలక ము­ప్పు­గా మా­రు­తుం­ది.

క్వాం­ట­మ్‌ సె­న్స­ర్ల వి­ని­యో­గం, క్వాం­ట­మ్‌ కీ డి­స్ట్రి­బ్యూ­ష­న్ నె­ట్‌­వ­ర్క్‌ల రూ­ప­క­ల్ప­న­తో భారత రక్షణ వ్య­వ­స్థ­కు గూ­ఢ­చ­ర్య సా­మ­ర్థ్యా­న్ని పెం­చే అవ­కా­శం ఉంది. భారత–పాక్ సరి­హ­ద్దు­లు, లద్దా­ఖ్‌, అరు­ణా­చ­ల్‌ ప్ర­దే­శ్‌­లో భూ­గ­ర్భ బం­క­ర్లు, సొ­రం­గాల గు­ర్తిం­పు, సము­ద్ర జలాం­త­ర్గా­ముల పర్య­వే­క్షణ వంటి అం­శా­ల్లో క్వాం­ట­మ్‌ సె­న్స­ర్లు కీ­ల­కం­గా ఉం­టా­యి. అలా­గే, GPS ఆధా­ర­ప­డ­కుం­డా నౌ­క­లు, వి­మా­నా­లు, సబ్‌­మె­రి­న్లు నడి­పిం­చ­డా­ని­కి కూడా వీ­టి­కి అవ­కా­శం ఉంది. 2021లో క్వాం­ట­మ్‌ ల్యా­బ్, 2023లో జా­తీయ క్వాం­ట­మ్‌ మి­ష­న్‌­ను ప్రా­రం­భిం­చి 6,003 కో­ట్లు కే­టా­యిం­చిం­ది. IIT­లు, IISc, టాటా మౌ­లిక శా­స్త్రాల సం­స్థ, సై­న్యం, పరి­శో­ధ­కు­లు QKD, క్వాం­ట­మ్‌ అల్గొ­రి­థ­మ్స్, సి­మ్యు­లే­ష­న్ల­పై పని­చే­స్తు­న్నా­రు. అమ­రా­వ­తి­లో ఏర్ప­డే “క్వాం­ట­మ్‌ వ్యా­లీ” దే­శా­ని­కి అణు, డి­జి­ట­ల్, రక్షణ, వై­ద్య, ఫై­నా­న్స్ రం­గా­ల్లో కీలక కేం­ద్రం­గా మా­రు­తుం­ది. స్వ­దే­శీ QKD నె­ట్‌­వ­ర్క్, క్వాం­ట­మ్‌ చి­ప్‌­లు, సె­న్స­ర్ ప్లా­ట్‌­ఫా­ర­మ్‌­లు వి­దే­శీ ఆధా­రా­న్ని తగ్గి­స్తా­యి. భా­ర­తం ఆత్మ­ని­ర్భ­రం­గా, భవి­ష్య­త్ క్వాం­ట­మ్‌ సాం­కే­తి­క­త­ల­కు ఆధా­రం­గా రక్షణ, సై­బ­ర్‌, గూ­ఢ­చ­ర్య సా­మ­ర్థ్యా­ల­ను అభి­వృ­ద్ధి చే­సు­కో­వ­డం అత్య­వ­స­ర­మ­ని ఈ వి­శ్లే­షణ స్ప­ష్టం చే­స్తుం­ది. ప్ర­పంచ క్షే­త్రం­లో వె­ను­క­బ­డ­కుం­డా ని­ల­వా­లం­టే, క్వాం­ట­మ్‌ రం­గం­లో పె­ట్టు­బ­డు­లు, నై­పు­ణ్యాల సృ­ష్టి, స్వ­దే­శీ మౌ­లిక సౌ­క­ర్యాల అభి­వృ­ద్ధి కీ­ల­క­మ­ని తె­లు­స్తోం­ది.

Tags

Next Story