Apple : యాపిల్ కు రూ.1388 కోట్ల జరిమానా

Apple : యాపిల్ కు రూ.1388 కోట్ల జరిమానా
X

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ కు ఫ్రాన్స్ భారీ జరిమానా విధించింది. యాపిల్ సంస్థయూజర్ల గోప్యత పేరుతో ప్రకటనలకు సంబంధించి తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని ఫ్రాన్స్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ ప్రకటించింది. ఇందుకు యాపిలక్కు 150 మిలియన్ యూరోల ఫైన్ విధించింది. ఈ మొత్తం భారత్ కరెన్సీలో 1388 కోట్లకు సమానం. ఐఓఎస్, ఐప్యాడ్ డివైజ్ ల్లో యూజర్ల డేటా భద్రత కోసం యాపిల్ యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ (ఏటీటీ) ఫ్రేమ్ వర్క్ ను అమలు చేస్తోంది. దీంతో యాపిల్ సిస్టమ్స్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ డేటా సేకరించాలంటే, ఐఫోన్ లేదా ఐపాడ్ యాజర్లు తప్పనిసరిగా తమ సమ్మతిని తెలియ చేయాల్సి ఉంటుంది. గోప్యతా ప్రమాణాల కింద దీన్ని అమలు చేస్తున్నట్లు యూపిల్ చెబుతోంది.

అయితే ఫ్రేమ్వర్ విమర్శలకు తావులేనిదే అయినప్పటికీ, దీనిని అమలు చేసే విధానం మాత్రం యూజర్ల డేటాను రక్షించానల్న కంపెనీ లక్ష్యాలకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేసిన ఫ్రాన్స్ రెగ్యులేటరీ యాపిల్ మొబైల్ అప్లికేషన్ల విషయంలో తన ఆధిపత్యాన్ని దుర్వినియో గం చేస్తోందని గుర్తించింది. దీని వల్ల థర్డ్ పార్టీ యూజర్లు, ఐఓఎస్ సిస్టమ్స్ కి వెళ్లేందుకు కష్టతరంగా మారుతోందని పేర్కొంది. ఇదుకు అమెరికా కంపెనీ 150 మిలియన్ యూరోల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తీర్పుపై స్పందించిన యాపిల్ ఈ ఫీచర్లపై కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోందని, ఫ్రెంచ్ కాంపిటిసన్ అథారిటీ నిర్ణయం తమను అసంతృప్తికి గురి చేసిందని తెలిపింది.

Tags

Next Story