Ethiopia: ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం

దక్షిణ ఇథియోపియాలో నిన్న సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఓ వివాహానికి హాజరైన బృందం తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 71 మంది జల సమాధి అయ్యారు. సిదమా రాష్ట్రంలోని గెలాన్ వంతెనపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో ట్రక్కు ఒక్కసారిగా అదుపుతప్పి నదిలో పడిపోయింది.
ఇథియోపియాలోని బోనా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సిదామా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోవడంతో 71మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే, డామా ప్రాంతంలోని అధికారులు రిలీజ్ చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో ప్రయాణికులతో సిదామా ఏరియాలో వెళ్తున్న ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పడంతో రోడ్డుపై నుంచి నదిలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు చనిపోయినట్లు పేర్కొన్నారు. ఇక, మరణించిన వారి మృతదేహాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
అయితే, ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. ఇక, మృతుల్లో కొందరు స్థానికంగా ఓ పెళ్లికి హాజరై, తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్ల సమాచారం. కాగా, పేద దేశమైన ఇథియోపియాలో సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు అని స్థానిక పోలీసు అధికారులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com