PM Modi : న్యూయార్క్ స్వామి నారాయణ్ ఆలయంపై దాడి.. 22న మోడీ విజిట్

అమెరికాలో బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయంపై దాడి జరిగింది. ఈ దాడిని భారతీయ రాయ బార కార్యాలయం ఖండించింది. నీచమైన చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా పోలీసులు ను కోరినట్లు న్యూయార్క్ లోని కాన్సులేట్ తెలిపింది.
మెలివిల్లీలో ఉన్న స్వామినారాయన్ ఆలయాన్ని ధ్వంసం చేయడం ఆమోదించదగ్గ చర్య కాదని ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ ప్రజలతో టచ్ లో ఉన్నామని పేర్కొం ది. ఆలయంపై జరిగిన దాడి ఘటన పట్ల విచారణ చేపట్టాల ని హిందూ అమెరికా ఫౌండేషన్ పేర్కొన్నది. హిందూ ఆలయంపై దాడి చేయడం అంటే పిరికిపంద చర్యే అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎడిటర్ సుహాగ్ శుక్లా తెలిపారు. లాంగ్ ఐలాండ్లోని సఫోలాక్ కౌంటీలో మెలివి ప్రాంతం ఉంది.
ఈ ఊరుకు సమీపంలోనే ప్రధాని మోడీ ఈనెల 22వ తేదీన భారతీయ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com