Donald Trump : ట్రంప్‌పై మళ్లీ కాల్పులు?

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మళ్లీ మర్డర్ అటెంప్ట్ జరిగినట్టు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఫ్లోరిడాలో తన వెస్ట్ పామ్ బీచ్ ఏరియాలో సొంత గోల్ఫ్ కోర్స్ లో గోల్ఫ్ ఆడుతుండగా కాల్పులు జరిగాయి.
ట్రంప్ క్షేమమేనని ఆయన భద్రత వ్యవహారాల విభాగం తెలిపింది. కాల్పుల సౌండ్ వినిపించగానే గోల్ఫ్ కోర్స్ నుంచి ట్రంప్ ను తరలించినట్టు భద్రతా విభాగం తెలిపింది. గోల్ఫ్ కోర్స్ మూసేసి ట్రంప్ ను అక్కడి నుంచి షిఫ్ట్ చేసినట్టు ప్రకటించింది. తాను సేఫ్ గా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు.
తుపాకీతో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన నిందితున్ని 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్‌గా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించారు. ఫైరింగ్ టైంలో ట్రంప్‌కు దాదాపు 275-450 మీటర్ల దూరంలో ఉన్నాడు. ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న ప్రదేశానికి దగ్గరగా పొదల్లో నుంచి ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు నెలల క్రితం, పెన్సిల్వేనియా రాష్ట్రం బట్లర్ నగరంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ట్రంప్ పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా మరోసారి కాల్పుల ఘటన జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తాజా కాల్పులపై స్పందించారు. అమెరికాలో హింసకు చాన్సే లేదని అన్నారు. నిందితులెవరో తేలుతుందని అన్నారు. కాల్పులు ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని జరిగాయా? అనేదానిపై ఇంకా అధికారులు ఓ నిర్ధారణకు రాలేదు. కొన్ని సంస్థలు మరోరకంగా వార్తలు ప్రసారం చేశాయి. కాల్పులు ట్రంప్ ను ఉద్దేశించినవి కాదని.. కొంత దూరంలో శబ్దం వినిపించిందని తెలిపాయి. గోల్ఫ్ కోర్స్ బయట ఇద్దరు వ్యక్తులు పరస్పరం కాల్పులకు దిగినట్టు తెలిపాయి. దీనిపై అధికారిక విచారణ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com