Bangladesh : 2026 లోనే బంగ్లా ఎన్నికలు.. సలహాదారు మహమ్మద్ యూనుస్ వెల్లడి

బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు 2026 ఏప్రిల్ ప్రథమార్థంలో జరుగుతాయని ఆ దేశంలోని తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనుస్ ప్రకటించారు. శుక్రవారం ఈద్-ఉల్-అఝా సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన యూనుస్, 2026 ఏప్రిల్ తొలి వారంలో జాతీయ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. రాబోయే నెలల్లో వచ్చే ఏడాది ఎన్నికలకు ఆ దేశ ఎన్నికల సంఘం రోడ్ మ్యాప్ ను అందిస్తుందని క ూడా ఆయన అన్నారు. 'చరిత్రలో అత్యంత స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, పోటీతత్వ, ఆమోదయోగ్యమైన ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చలు జరిపింది. అదనంగా.. న్యాయం, సంస్కరణలు, ఎన్నికలకు సంబంధించి కొనసాగుతున్న సంస్కరణ కార్యకలాపాలను సమీక్షించిన తర్వాత తదుపరి జాతీయ ఎన్నికలు 2026 ఏప్రిల్ తొలి అర్ధభాగంలో జరుగుతాయని దేశ ప్రజలకు ప్రకటిస్తున్నాను' అని యూనుస్ వెల్లడించారు. బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయం యూనుస్, ప్రతిపక్షమైన మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియాకు మధ్య చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com