Bangladesh PM : బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా .. సైన్యం చేతుల్లోకి పాలన

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆ మేరకు ఆదివారం ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ ప్రకటించారు. ఇకనైన హింసకు ముగింపు పలకాలని ఆందోళనకారులను కోరారు. దేశంలో శాంతిభద్రతల నిర్వహణ బాధ్యత సైన్యానిదేనని చెప్పారు. కాగా బంగ్లాదేశ్లో మళ్లీ హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 100 మందికిపైగా మృతి చెందారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు మొత్తం 300 మంది చనిపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సోమవారం రాజధాని ఢాకాలోని ప్రధాని హసీనా ఇల్లు, ఆఫీసులను ఆందోళనకారులు ముట్టడించారు. ఈ క్రమంలోనే ముందుజాగ్రత్త చర్యగా ఢాకా ప్యాలెస్‌ను వీడిన ప్రధానమంత్రి షేక్ హసీనా.. సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు. అయితే షేక్ హసీనా దేశాన్ని వీడినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com