Beggar : బిచ్చగాడి జేబులో రూ.5 లక్షలు!.. ఎక్కడో తెలుసా?

Beggar : బిచ్చగాడి జేబులో రూ.5 లక్షలు!.. ఎక్కడో తెలుసా?
X

బిచ్చగాడి జేబులో రూ.5 లక్షలకు పైగా డబ్బు దొరికిన షాకింగ్ ఘటన పాకిస్థాన్ల్ లో బయటపడింది. పంజాబ్ ప్రావిన్స్ లోని సర్లోధా జిల్లాలోని ఖుషజ్ రోడ్ లో బిచ్చగాడు అపస్మా రక స్థితిలో పడి ఉన్నాడు. వృద్ధుడిని ఆస్పత్రికి తరలించిన రెస్క్యూ టీమ్ అతడి నుంచి రూ.6 లక్షల 34 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బిచ్చగాడి నుంచి పలుమార్లు సౌదీ అరేబియా వెళ్లినట్లు తెలిపే పాస్ పోర్టు కూడా లభించింది. వృద్ధుడు సౌదీ అరేబియా వెళ్లి భిక్షాటన చేసేవాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రోడ్డుపై పడి ఉన్న అతడిని రక్షించే సమయంలో ఆసుపత్రికి తీసుకువెళుతుండగా.. సహాయకులకు అతని జేబులో భారీగా డబ్బు కనిపించింది.

అన్నోన్ కాల్ రాగానే వృద్ధుడికి సహాయం చేయడానికి ఓ రెస్క్యూ టీమ్ కు చేరుకుంది. ఆ వ్యక్తి అదే ప్రాంతంలో భిక్షాటన చేస్తాడని అక్కడి ప్రజలు ఆ బృందానికి తెలిపారు. వృద్ధుడిని

ఆసుపత్రికి తరలించామని అతను కోలుకున్నాక ఇంటికి వెళ్లే మార్గంలో అతని డబ్బు, వస్తువులన్నీ తిరిగి ఇచ్చామని రెస్క్యూ అధికారులు తెలిపారు. గతేడాది సెప్టెంబర్ లో పాకిస్థాన్ పౌరులు ఉమ్రా వీసాపై సౌదీ అరేబియాకు వెళ్లి భిక్షాటన చేస్తున్నట్టు అనేక వార్తలు వచ్చాయి. సౌదీ ఆరేబియాలోని మస్జిద్ అల్ హరామ్ వెలుపల పట్టుబడిన పిక్ పాకెటర్లలో ఎక్కువ మంది పాకిస్థానీ మూలానికి చెందినవారని., ఈ వ్యక్తులు భిక్షాటన చేయడానికి ఉమ్రా వీసాపై సౌదీకి చేరుకుంటారని వారు తెలిపారు.

Tags

Next Story