Ukraine Border : ఉక్రెయిన్ బోర్డర్‌లో బెలారస్ సైన్యం మోహరింపు

Ukraine Border : ఉక్రెయిన్ బోర్డర్‌లో బెలారస్ సైన్యం మోహరింపు

ఉక్రెయిన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. బెలారస్ సరిహద్దు వెంబడి 1.2 లక్షల మంది సైని కులను కీవ్ మోహరించింది. దీనికి ప్రతిగా బెలారస్ కూడా తమ బలగాలను ఉక్రెయిన్ సరిహద్దులకు తరలిస్తోంది. మూడోవంతు సైన్యాన్ని మోహరించామని బెలారస్ అధ్యక్షుడు అలగ్జాండర్ లుకషింకో ఆదివారం నాడు తెలిపారు.

వ్లాదిమిర్ పుతిన్ ను బలమైన మిత్రుడుగా అభివర్ణించిన లుకషెంకో.. ఉక్రెయిన్ చొరబాటు నేపథ్యానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆగస్టు 6న వేలాది కీవ్ సైనికులు రష్యా పశ్చిమ సరిహద్దును ధ్వంసం చేశారని చెప్పారు. అయినా ఇది పుతిన్ సైనికాధి కారులకు ఇబ్బంది కాబోదని, కీవ్ దూకుడు విధానానికి దీటుగా మేము మా బలగాల్ని అటువైపు మోహరించామని రష్యా వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లుకషెంకో తెలిపారు.

కాగా, దీనిపై సరిహద్దులో ఆర్మీ ప్రతినిధి ఆండ్రీ డెమంకో మాట్లాడుతూ, "బెలారస్ సరిహద్దులో పరిస్థితి మారలేదు. లుకషెంకో వాక్చా తుర్యం కూడా మారలేదు. ఉగ్రవాద దేశాన్ని సంతోషపెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి మా సరిహద్దువైపు కొత్తగా బెలారస్ సైన్యం కానీ యుద్ధ పరికరాల మోహరింపు కానీ మాకైతే కనిపించలేదు" అని చెప్పారు.

Tags

Next Story