Trump : జన్మత: పౌరసత్వం అమలుపై సుప్రీంకోర్టుకు ట్రంప్ పాలకవర్గం

Trump : జన్మత: పౌరసత్వం అమలుపై సుప్రీంకోర్టుకు ట్రంప్ పాలకవర్గం
X

జన్మత: పౌరసత్వంపై ఆంక్షలను పరిమితంగా అమలు చేసేందుకు అనుమతించాలని డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గం సుప్రీంకోర్టును కోరింది. దేశవ్యాప్తంగా ప్రెసిడెంట్ ఆర్డర్‌ను అడ్డుకొనే అధికారం జిల్లా కోర్టులు, ఇండివిడ్యువల్ జడ్జిలకు లేదని తెలిపింది. న్యాయపోరాటం చేస్తున్నవారిని మినహాయించి ట్రంప్ ఆదేశాల అమలుకు అనుమతించాలని కోరింది. ఆమెరికాలో అక్రమ నివాసితులకు పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వకుండా ట్రంప్ ఆదేశించడం తెలిసిందే. అమెరికా చట్టాల ప్రకారం.. ఆ దేశ పౌరులకు పుట్టినవారికి మాత్రమే కాకుండా.. అమెరికాలో జన్మించిన ప్రతిఒక్కరికీ అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టినవారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. అయితే, తాజాగా ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులతో దీనికి బ్రేక్‌ పడింది.

Tags

Next Story