Germany : బాష్ కంపెనీలో ఉద్యోగాల కోత .. 7000 మంది ఔట్

ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ రంగంలో సేవలందిస్తున్న బాష్ కంపెనీ తన ఉద్యోగులకు తగ్గించబోతున్నట్లు సంకేతాలిచ్చింది. జర్మనీలోని తన ప్లాంట్లో పని చేస్తున్న దాదాపు 7,000 మంది ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించనున్నట్లు జెక్పోస్పోలిటా నివేదించింది. జెక్పోస్పోలిటా నివేదికలోని వివరాల ప్రకారం..బాష్ సీఈఓ స్టీఫెన్ హర్తంగ్ మాట్లాడుతూ..‘ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆటోమోటివ్ సేవలందిస్తున్న బాష్ కంపెనీ ఉద్యోగులను తగ్గించే పనిలో నిమగ్నమైంది. జర్మనీ ప్లాంట్లోని దాదాపు 7,000 మంది సిబ్బందికి ఉద్వాసన కల్పించనుంది. ప్రధానంగా ఆటోమోటివ్ సప్లై సెక్టార్లో, టూల్స్ డివిజన్, గృహోపకరణాల విభాగంలో పనిచేసే వారు ఈ నిర్ణయం వల్ల త్వరలో ప్రభావం చెందవచ్చు’ అని చెప్పారు. ‘కంపెనీ 2023లో దాదాపు 98 బిలియన్ డాలర్ల(రూ.8.18 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com