Russia: రష్యా వాగ్నర్‌ సేన తిరుగుబాటుకు బ్రేక్‌

Russia: రష్యా వాగ్నర్‌ సేన తిరుగుబాటుకు బ్రేక్‌
రష్యాలో వాగ్నర్‌ సేన తన తిరుగుబాటుకు బ్రేక్‌ ఇచ్చింది. తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు వాగ్నర్‌ సేన చీఫ్‌ ప్రిగోజిన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చేశాడు.

రష్యాలో వాగ్నర్‌ సేన తన తిరుగుబాటుకు బ్రేక్‌ ఇచ్చింది. తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు వాగ్నర్‌ సేన చీఫ్‌ ప్రిగోజిన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చేశాడు.చర్చల కోసం బెలాసరస్‌కు వెళ్లాడు. ఒకదశలో అంతర్యుద్ధం తప్పదన్న వాతావరణం రష్యాలో నెలకొంది. పుతిన్‌ పెంచి పోషించిన ప్రైవేట్‌ ఆర్మీ వాగ్నర్‌ గ్రూపు ఆయనపైనే తిరుగుబాటు చేసింది. ఒక్కొక్క నగరాన్నీ దాటుకుంటూ మాస్కోకు 200 కిలోమీటర్ల దూరం దాకా వెళ్లి పుతిన్‌ను షాక్‌కు గురిచేసింది.అయితే వాటి చర్యలను తిప్పికొట్టేందుకు రష్యా ఆర్మీ కూడా అంతే రీతిలో రెడీ అయ్యాయి. భారీగా సైనిక వాహనాలు,బలగాల్ని మోహరించాయి.దీంతో పెద్దఎత్తున రక్తపాతం తప్పదన్నవాతావరణం నెలకొంది.పుతిన్‌ మాస్కోను వీడారనీ, ఓ బంకర్‌లోకి వెళ్లారని సోషల్‌

మీడియాలో వార్తలు వచ్చాయి. చివరికి బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తాము ఉక్రెయిన్‌ సరిహద్దులోని స్థావరాలకు వెళ్లిపోతున్నామని వాగ్నర్‌ అధినేత ప్రిగోజిన్‌ ప్రకటించారు.

ఇక ప్రిగోజిన్‌తో బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో చర్చలు జరిపడంతో వాగ్నర్‌ సేనలు వెనక్కి తగ్గాయి. ఉద్రిక్తతను తగ్గించడానికి బలగాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. వాగ్నర్‌ దళానికి భద్రతపరమైన హామీలు ఇవ్వడంతో సంధి కుదిరిందని సమాచారం. ప్రిగోజిన్‌ కూడా రక్తపాతం లేకుండా చేయడానికి తమ దళాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అంగీకరించారు. తిరిగి తమ తమ స్థానాల్లోకి వెళ్లిపోతున్నామని ప్రకటించారు.మరోవైపు సైనిక నాయకత్వం కోసమే వాగ్నర్‌ సేనలు ప్రయత్ని స్తున్నట్లు సమాచారం. అయితే అధ్యక్షుడి అధికారాలకు గానీ, ప్రభుత్వం, పోలీసులు, రష్యాగార్డ్స్‌ విధులకు గానీ ఎలాంటి ఆటంకం ఉండదని ప్రిగోజిన్‌ చెప్పారు. యుద్ధం పేరుతో రష్యా రక్షణ శాఖ తన దళంలోని అనేకమందిని హతమార్చిందని ఆరోపించారు.

ఇక ప్రధానిగా, అధ్యక్షునిగా రెండు దశాబ్దాల పాటు రష్యాను ఏలుతున్న పుతిన్‌కు మొదటిసారిగా స్వంత దేశంలోనే తిరుగుబాటు ఎదురైంది.. ఉక్రెయిన్‌పై యుద్ధంలో సాయం చేస్తున్న వాగ్నర్‌ గ్రూపు పుతిన్‌పైనే తిరుగుబాటు చేసింది. తమ దళాన్ని తీసుకుని మాస్కోకు దగ్గర్లోని రొస్తోవ్‌ ఆన్‌ డాన్‌లోని రష్యా సైనిక కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకుంది.తాము చేస్తున్నది న్యాయం కోసం పోరాటమే తప్ప తిరుగుబాటు కాదని క్లారిటీ ఇచ్చేశాడు.మాస్కోలో ఆర్మీని కూలదోస్తామని శపధం చేసింది.పుతిన్‌ స్థానంలో కొత్త అధ్యక్షుడు వస్తారని ప్రిగోజిన్‌ స్టేట్‌మెంట్‌లు కూడా ఇచ్చేశాడు.

అయితే అనూహ్య పరిణామంతో రష్యా హెడ్‌ క్వార్టర్‌ అలెర్ట్ అయింది.మాస్కోతో సహా రష్యాలోని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు మొదలుపెట్టారు. రష్యా కీలక రొస్తోవ్‌, లిపెట్స్క్‌లో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.సోమవారం సెలవుదినంగా ప్రకటించారు. వాగ్నర్‌ చీఫ్‌పై రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ క్రిమినల్‌ కేసు పెట్టింది. ప్రిగోజిన్‌ ఆదేశాలను వాగ్నర్‌ సేనలు పట్టించుకోవద్దంది. వెంటనే అతడిని అరెస్టు చేయాలని ఆదేశించింది.ప్రైవేటు సైన్యం మాస్కోకు చేరకుండా మార్గాన్ని మూసివేశారు.

మరోవైపు ప్రిగోజిన్‌కు స్టోమ్‌ జెడ్‌ మద్దతు తెలిపింది.రష్యన్‌ జైళ్లలో నిర్బంధించిన ఖైదీలు వీరు. రష్యా రక్షణ శాఖ దీనిని ఏర్పాటు చేసింది.అయితే పుతిన్‌కు రష్యా పార్లమెంటు పూర్తి మద్దతు ప్రకటించింది. క్రిమియా గవర్నర్‌, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ నేతలు కూడా అధ్యక్షుడి వెంటే ఉన్నారు. చెచెన్యా నేత కదిరోవ్‌ రష్యాకు మద్దతు తెలిపారు. రష్యా పరిణామాలను గమనిస్తోన్న పోలండ్‌ అప్రమత్తమైంది మాస్కో అతిపెద్ద భద్రతా సవాలును ఎదుర్కొంటోందని బ్రిటన్‌ రక్షణ శాఖ తెలిపింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story