Britain : కఠిన చర్యలకు సిద్ధమవుతున్న బ్రిటన్

అక్రమ వలసలపై బ్రిటన్ కూడా కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాటలోనే వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. చట్టవిరుద్ధం గా తమ దేశంలోకి ప్రవేశించి, ఉపాధి పొందుతున్న 600 మందికిపైగా వలసదారులను అరెస్టు చేసింది. దీనిపై తాజాగా బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ ప్రకటన చేశారు. అక్రమ వలసల్ని తిప్పి పంపుతామని, దొడ్డిదారి ప్రవేశాలకు ముగింపు పలుకుతామని హెచ్చరించారు. వాస్తవానికి ఇటీవలి సంవత్సరాల్లో యూకేకి అక్రమ వలసలు పెరిగాయి. ఇలాంటి వాళ్లు చాలా మంది ఉపాధి పొందుతున్నారు అని స్మార్టర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నా రు. గతేడాది జులైలో బ్రిటన్ లేబర్ పార్టీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచే కీర్ స్మార్టర్ ప్రభుత్వం బోర్డర్ సక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు వందల మంది అక్రమ వర్కర్లను అరెస్టు చేసారు. వీరంతా చట్టవిరుద్ధంగా యూకేలో అడుగుపెట్టి, బార్లు, రెస్టారెంట్లు, కార్ వాషింగ్ కేంద్రాలు, ఇతర స్టోర్లలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారు లు 609 మందిని అరెస్టు చేసారు. గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు నాలుగు వేల మంది అక్రమ వర్కర్లను అరెస్టు చేసినట్లు యూకే హోంశాఖ గణాంకాలు పేర్కొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com