బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు.. కన్జర్వేటివ్ పార్టీ ఓటమి.. ప్రధాని పదవికి రాజీనామా చేసిన రిషి సునక్

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు.. కన్జర్వేటివ్ పార్టీ ఓటమి.. ప్రధాని పదవికి రాజీనామా చేసిన రిషి సునక్
UK ఎన్నికలలో కైర్ స్టార్మర్స్ లేబర్ పార్టీ భారీ మెజారిటీతో దూసుకుపోవడంతో బ్రిటిష్ ప్రజలు 'హుందాగా తీర్పు' ఇచ్చారని రిషి సునక్ అన్నారు.

ఎన్నికలలో కన్జర్వేటివ్‌లు చారిత్రాత్మక ఓటమి దిశగా పయనిస్తున్న సమయంలో UK ప్రధాన మంత్రి రిషి సునక్ తన ఓటమిని అంగీకరించారు. హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేబర్ పార్టీ మెజారిటీ మార్కును దాటిందని ట్రెండ్‌లు చూపించినందున స్టార్‌మర్ తదుపరి UK ప్రధానమంత్రి కానున్నారు.

బ్రిటీష్ ప్రజలు "హుందాగా తీర్పు" ఇచ్చారని, నేర్చుకోవడానికి చాలా ఉందని రిషి సునక్ అన్నారు.వారి తీర్పును నేను శిరసావహిస్తాను" అని UK ప్రధాన మంత్రి సునక్ అన్నారు. "ఈ సార్వత్రిక ఎన్నికలలో లేబర్ పార్టీ విజయం సాధించింది, అతని విజయానికి అభినందనలు తెలియజేస్తూ సునక్ స్టార్‌మర్‌కు ఫోన్ చేసానని తెలిపారు రిషి సునక్.

ఎనిమిది మంది కన్జర్వేటివ్ క్యాబినెట్ మంత్రులు తమ స్థానాలను కోల్పోయినప్పటికీ, సునక్ ఉత్తర ఇంగ్లాండ్‌లోని రిచ్‌మండ్ మరియు నార్తల్లెర్టన్ నియోజకవర్గాల్లో 47.5% ఓట్లను సాధించారు.

"ఓడిపోయిన చాలా మంది మంచి, కష్టపడి పనిచేసే కన్జర్వేటివ్ అభ్యర్థులకు, వారి అవిశ్రాంత ప్రయత్నానికి, కమ్యూనిటీల పట్ల వారి అంకితభావానికి నా ధన్యవాదాలు.. నన్ను క్షమించండి" అని సునక్ అన్నారు.

రిషి సునక్ తన ముందున్న లిజ్ ట్రస్ కేవలం 45 రోజుల పదవికి రాజీనామా చేసిన తర్వాత 2022లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

14 సంవత్సరాలు పాలించిన తరువాత, కన్జర్వేటివ్ పార్టీ అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ నుండి గందరగోళంగా నిష్క్రమించిన తరువాత ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం ఆయనకు కత్తిమీద సాముగా మారింది.

2022లో ద్రవ్యోల్బణం 11.1%కి చేరుకోవడంతో టోరీలకు నష్టం వాటిల్లిందని నమ్ముతారు. కోవిడ్ -19 మహమ్మారి మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ప్రభుత్వం సరిగా నిర్వహించడంలో విఫలమైనందు వల్ల ఓటర్లు కూడా విసుగు చెందారని అభిప్రాయ సేకరణలు వెల్లడించాయి.

సెంట్రల్ లండన్‌లో విలేకరులను ఉద్దేశించి కైర్ స్టార్మర్ మాట్లాడుతూ, రాబోయే లేబర్ ప్రభుత్వం యొక్క పని ప్రజల ఆశలకు, ఆశయాలకు కట్టుబడి ఉంటుందని అన్నారు.

"మేము రాజకీయాలను ప్రజా సేవకు తిరిగి ఇవ్వాలి... ఈ గొప్ప దేశం యొక్క భుజాల నుండి ఎట్టకేలకు ఒక భారం తొలగించబడింది" అని స్టార్మర్ చెప్పారు.

Tags

Next Story