Bulgaria: ఉన్నట్టుండి బస్సులో చెలరేగిన మంటలు.. 46 మంది సజీవ దహనం..

Bulgaria (tv5news.in)
X

Bulgaria (tv5news.in)

Bulgaria: రోడ్డు ప్రమాదాలు ఒక్కొక్కసారి చాలామంది ప్రాణాలను బలిదీసుకుంటాయి.

Bulgaria: రోడ్డు ప్రమాదాలు ఒక్కొక్కసారి చాలామంది ప్రాణాలను బలిదీసుకుంటాయి. రోడ్డు ప్రమాదాలు అనేవి రోజూ జరుగుతూనే ఉన్నా.. అవి జరగకుండా ఉండడానికి పలు చర్యలు తీసుకుంటున్నా కానీ ఏదో ఒక విధంగా ఈ ప్రమాదాల్లో ప్రజలు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా బల్గేరియాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వల్ల ఏకంగా 40కు పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు.

అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో బల్గేరియాలోని బోస్నక్ గ్రామంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. కదులుతున్న బస్సులో నుండి ఉన్నపళంగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సు నిండా జనాలు ఉన్నారు. దాదాపు 46 మంది మంటల్లో సజీవదహనం అయినట్టు సమాచారం. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

బస్సు నెంబర్ ప్లేట్‌ను బట్టి అది ఇస్తాంబుల్ నుండి వచ్చినట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. టర్కీలోని ఇస్తాంబుల్ నుండి ఓ గ్రూప్ వీకెండ్ హాలీడే ట్రిప్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరగడంతో ఆ రోడ్డు మార్గాన్ని తాతాల్కికంగా మూసివేశారు.

Tags

Next Story