బంపరాఫర్.. వ్యాక్సిన్ వేయించుకుంటే లక్షల్లో ప్రైజ్ మనీ

బంపరాఫర్.. వ్యాక్సిన్ వేయించుకుంటే లక్షల్లో ప్రైజ్ మనీ
వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రైజ్ మనీ కూడా ఇస్తాము. కనీసం ఇప్పుడైనా మామాట విని టీకాలు వేయించుకోండి అని రాష్ట్ర ప్రజలను బతిమాలుతున్నారు. ఇ

అరే బాబు.. సైంటిస్టులు రేయింబవళ్లు ప్రయోగశాలల్లో ఉండి వ్యాక్సిన్ కనిపెడితే.. వేయించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారెందుకు.. వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రైజ్ మనీ కూడా ఇస్తాము.

కనీసం ఇప్పుడైనా మామాట విని టీకాలు వేయించుకోండి అని రాష్ట్ర ప్రజలను బతిమాలుతున్నారు. ఇదేదో మారు మూల పల్లెటూరి వాళ్లను ప్రశ్నించలేదు ఆ రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు.

దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం కాలిఫోర్నియా. వచ్చే నెల నుంచి పూర్తిగా తిరిగి తమ కార్యకలాపాలలో నిమగ్నమయ్యేందుకు ముందు జాగ్రత్త చర్యగా అందరికీ టీకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

టీకాలు వేయించుకున్న వారికి బహుమతులు అందించే మొట్టమొదటి రాష్ట్రం కాలిఫోర్నియా కాదు. అయినప్పటికీ ఈ రాష్ట్రం ప్రకటించిన ప్రైజ్ మనీ చాలా ఎక్కువ.

జూన్ 15 న రాష్ట్రం తమ పూర్వ వైభవాన్ని తీసుకురావాలనుకుంటుంది. టీకాలు వేయించుకున్న 10 మందిని డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులు ప్రకటిస్తారు.

మరో నలుగురు ఒక్కొక్కరికి $ 50,000 గెలుచుకుంటారు. ఈ బహుమతుల ప్రదానం జూన్ 4 నుండి ప్రారంభమవుతుంది.. కనీసం ఒక డోస్ వేయించుకున్న 12 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల ఎవరైనా అర్హులు. టీకాలు వేయించుకున్న తదుపరి 2 మిలియన్ల మందికి గిప్డ్ ఓచర్లు లభిస్తాయి.

12 మిలియన్ల మంది కాలిఫోర్నియా వాసులకు టీకాలు వేయలేదని రాష్ట్రం అంచనా వేసింది.

న్యూయార్క్ రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు 12 నుండి 17 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు వ్యాక్సిన్ వేయించుకుంటే వారిని కూడా డ్రా ద్వారా ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేయనుంది.

Tags

Read MoreRead Less
Next Story