Car Crash : కార్ అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..!

Car Crash : కార్ అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..!
బిల్డింగ్ రెండవ అంతస్తులోకి దూసుకువెళ్ళిన కారు

ఏదో సినిమాలో చిత్రగుప్తుడు గోడ మీద పిడకని చూసి ఆవు అక్కడికి వెళ్లి పేడ ఎలా వేసింది అని అడుగుతాడు.. మీరు ఈ ఫోటోను చూసి అబ్బా కారుని అలా ఎలా పార్క్ చేశారు అని మాత్రం అడగకండి.. ఎందుకంటే మరో మారు అలా పార్క్ చేయడానికి కుదరదు కాబట్టి.

అమెరికాలోని పెన్సిల్వానియాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. కారణాలు తెలియలేదు గాని ఒక కారు పక్కన ఉన్న బిల్డింగ్ రెండో అంతస్తులోకి వెళ్ళింది. చక్కగా పైకెళ్లి ఇరుక్కున్న ఆ కార్ ని ఫైర్ ఫైటర్లు బయటకు తీశారు. బిల్డింగ్ కి కారు పరిమాణంలో పెద్ద రంధ్రం కూడా పడింది. అక్కడ కార్ ఉంది పోయింది. సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగి కారును, కారు డ్రైవరును జాగ్రత్తగా కిందకు దించారు.



బిల్డింగ్ లోకి దూసుకెళ్లిన కారు, శిధిలమైన బిల్డింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెన్సిల్వానియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కారును ఓ 20 ఏళ్ల యువకుడు నడుపుతున్నాడు. ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అతడిని సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఇది ఆ వ్యక్తి కావాలని చేసిన పని అని అంటున్నారు పోలీసులు.. కానీ మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అతను కోలుకోవాలని చెబుతున్నారు.


అయితే స్థానికులు మాత్రం దగ్గర్లోని కల్వర్టు వద్ద ఓవర్ స్పీడింగ్ వలన రైలింగును ఢీకొని ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆ కారణంతోనే కారు గాల్లోకి లేచి ఉంటుందని a అనుమానిస్తున్నారు..

Tags

Read MoreRead Less
Next Story