Russian : రష్యా కాన్సులేట్‌లోకి దూసుకెళ్లిన కారు

Russian : రష్యా కాన్సులేట్‌లోకి దూసుకెళ్లిన కారు
X

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న రష్యా కాన్సులేట్‌లోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. ఒక తెలుపు రంగు SUV కారు రష్యా కాన్సులేట్ ప్రధాన ద్వారం గేటును ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లింది. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఉదయం 8 గంటలకు సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు డ్రైవర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అతను కారును గేటులోకి వేగంగా నడిపాడు. పోలీసులు 39 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి విచారణ నిమిత్తం సూరీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ ఘటనలో 24 ఏళ్ల పోలీసు అధికారి చేతికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో 24 ఏళ్ల పోలీసు అధికారి చేతికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు గల కారణాలు, నిందితుడి ఉద్దేశ్యం ఇంకా స్పష్టంగా తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న వీడియోలలో కారు కిటికీలు ధ్వంసమై, రష్యా జెండా పక్కన కారు ఆగి ఉన్నట్లు కనిపిస్తుంది. డ్రైవర్‌ను బయటకు తీయడానికి పోలీసులు తమ లాఠీలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తర్వాత కాన్సులేట్ భవనానికి పెద్దగా నష్టం జరగలేదని పోలీసులు ధృవీకరించారు.

Tags

Next Story