బ్రేకింగ్: గాలి ద్వారా కరోనా.. తన ప్రకటనను విరమించుకున్న సీడీసీ

గాలి ద్వారా కరోనా మహమ్మారి వ్యాపిస్తుందా? కరోనా వైరస్ విస్తరిస్తున్నప్పటి నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇది. దీనిపై మొదటి నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే చాలా మంది అలాంటిదేమీ ఉండదని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందా? లేదా? అనే విషయంపై పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలణ కేంద్రం(సీడీసీ) ఈ మధ్యే తన మార్గదర్శకాల్లో పొందుపరచింది. అయితే తాజాగా అమెరికా సీడీసీ ఈ ప్రకటనను విరమించుకుంది. తొందరలోనే దీనిపై స్పష్టత ఇస్తామని పేర్కొంది.
గాలిలో వైరస్ కణాలు ఆరు అడుగుల కంటే ఎక్కువ దూరం వ్యాపించగలవని సీడీసీ ఇటీవల ప్రకటించింది. అయితే, దానిని సీడీసీ వెబ్‌సైట్‌లో పెట్టిన రెండు రోజులకే ఆ సూచనను తొలగించింది. గాలిలో వైరస్ వ్యాప్తిపై సీడీసీ తమ మార్గదర్శకాలను మార్చడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇదిలాఉంటే, వెంటిలేషన్ సరిగాలేని రద్దీ ప్రదేశాల్లో గాలిలో వైరస్ వ్యాపించే అవకాశాలున్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com