Donald Trump : కాల్పుల విరమణ ఘనత నాదే

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ తన ఘనతేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సారి చెప్పారు. ఇరుదేశాల మధ్య ఇటీవలి వివాదాన్ని వాణిజ్యం అస్త్రం ద్వారా తానే పరిష్కరించానని బుధవారం పునరుద్ఘాటించారు. ఓవల్ కార్యాలయంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. భారత దేశం, పాకిస్తాన్ రెండింటితోనూ అమెరికా పెద్ద ఒప్పందం చేస్తోందని అన్నారు.ఎవరో ఒకరు యుద్ధాన్ని ప్రారంభించారు. కాల్పులు మరింత తీవ్రమయ్యాయి. ఘర్షణ మరింత పెద్దదైంది. దాడులు దేశంలోకి లోతుగా సాగుతున్నాయి. మేము వారితో మాట్లాడాము. వివాదాన్ని పరిష్కరించాం. పాకిస్తాన్లో కొంతమంది గొప్ప నాయకులు ఉన్నారు. భారతదేశంలో నా స్నేహితుడు మోడీ ఉన్నారు. అతను గొప్ప వ్యక్తి. అని ట్రంప్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com