మాస్క్ పెట్టుకోలే.. రెండున్నర లక్షల ఫైన్ కట్టిన ఆ దేశాధ్యక్షుడు!

కంటికి కనిపించని కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రస్తుతం వ్యాక్సిన్ లు ఏమీ కూడా అందుబాటులోకి రాకపోవడంతో మాస్క్ లు పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు. మాస్క్ ను కంపల్సరీ చేస్తూ కొన్ని దేశాలు రూల్స్ కూడా జారీ చేశాయి. మాస్క్ లేకపోతే జరిమానా కచ్చితంగా కట్టాల్సిందే అంటూ నియమాలు పెట్టుకున్నాయి. వీటికి ఎవరు కూడా అతీతులు కాదు. అందులో భాగంగానే మాస్క్ ధరించని ఓ దేశాధ్యక్షుడికే ఏకంగా భారీ జరిమానా పడింది.
చిలీ ప్రెసిడెంట్ సెబాస్టియన్ పినెరా(Sebastian Pinera) ఇటీవల ఓ బీచ్ కు వెళ్లారు. అక్కడ ఓ మహిళా అభిమానితో అయన సెల్ఫీ దిగినప్పుడు మాస్కు లేకుండా కనిపించాడు. ఆ మహిళ అభిమానికి కూడా మాస్క్ ధరించలేదు.. దీనితో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం మాస్క్ ధరించని కారణంతో సెబాస్టియన్ పినెరా దాదాపు 2లక్షల 57 వేల జరిమానా ఎదుర్కొన్నారు.
దీనికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు కూడా . ప్రస్తుతం చిలీలో 5,81,135 వైరస్ కేసులు నమోదు కాగా, 16,051 మరణాలు సంభవించాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే ఈ చిన్న దేశంలోనూ ఫైన్, జైలు శిక్షలను అమలు చేస్తున్నారు.
#Coronavirus Chilean President Sebastián Piñera has been fined $3,500 for breaching coronavirus rules by posing for a selfie with no facemask on.
— datastocks (@Renepdata) December 20, 2020
Mr Piñera apologised after the photo of him with a woman - also without a mask
The president admitted he should have worn a mask. pic.twitter.com/CwB4P1TUGh
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com