డ్రాగన్ కంట్రీ కంత్రీ పనులు.. భారత్‌ను టార్గెట్ చేస్తూ గ్రామాలు..

డ్రాగన్ కంట్రీ చైనా.. తన కంత్రీ పనులు మానడం లేదు. భారత్‌ను టార్గెట్ చేస్తూ..వ్యూహాత్మక ప్రాంతాల్లో గ్రామాలకు గ్రామాలు నిర్మిస్తోంది. ఏకంగా 624 ఊళ్లు నిర్మించాలన్న ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని గ్రామాలు శరవేగంగా పూర్తయ్యాయి. మరికొన్ని నిర్మాణదశలో ఉన్నాయి. ఈ గ్రామాల ద్వారా ఆయా ప్రాంతాలపై పట్టు సాధించాలన్నదే చైనా వ్యూహం. భారత్‌తో పాటు, భూటాన్, నేపాల్ సరిహద్దుల్లో ఈ ఊళ్లు వెలుస్తున్నాయి.
ముందుగా గ్రామాలు నిర్మించడం, ఆ ఊళ్లలోకి ప్రజల్ని చేరవేడం,ఆ తర్వాత వాటిని సైనిక స్థావరాలుగా మార్చడం.. ఇదే చైనా ప్లాన్. ఈ గ్రామాల్లోనే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్టేషన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, భూగర్భ ఆయుధ బంకర్లను సైతం ఏర్పాటు చేస్తుంది. అంతేకాదు సైకలాజికల్ వార్ఫేర్, తప్పుడు వార్తలను ప్రచారంలోకి తీసుకురావడం, భయపెట్టే దౌత్య విధానాలను అవలంభించడం చేస్తుంది. పూర్తి స్థాయి యుద్ధం చేయుకండా ఇలా గ్రామల రూపంలో భూభాగాలను ఆక్రమిస్తోంది. ఈ విధానాన్ని సలామీ స్లైసింగ్' అంటారు. హిమాలయాల్లోని సరిహద్దు వివాదాలున్నచోట్ల దాదాపు 624 గ్రామాలను నిర్మించాలని చైనా లక్ష్యంగా పెట్టుకొంది. ఈ విషయాన్ని గతేడాది 'సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు' చైనా అధికారిక పత్రాలను ఉదహరిస్తూ... జపాన్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.
పేదరిక నిర్మూలనలో భాగంగా.. ఈ గ్రామాల్లో తమ ప్రజల్ని తరిలిస్తున్నట్లు ప్రపంచానికి నమ్మించేందుకు చైనా ఈ కుట్రలు చేస్తోంది. ఈ ఊళ్లలో టిబెట్ వాసులు, హాన్ చైనీయులను సరిహద్దులకు తరలిస్తోంది. వీరంతా కమ్యూనిస్టు పార్టీ తరఫున అధికారిక వ్యవహారాలను చూస్తుంటారు. ఇక్కడ్నుంచి భారత్, భూటాన్, నేపాల్ సరిహద్దుల్లో భూవివాదం సృష్టింస్తుంది. ఇందుకోసం పశువుల కాపర్లను వాడుకుంటోంది చైనా.
అంతర్జాతీయ చట్టాల ప్రకారం తన వాదానలకు బలం లభించేందుకు ఈ వ్యూహం అమలు చేస్తోంది డ్రాగన్ కంట్రీ. అంతేకాదు.. ఈ గ్రామాల్లోని పౌరులు.. నిఘావర్గాల కూడా పనిచేస్తారు. ఇటీవల భారత్ నుంచి ఆక్రమించిన భూభాగంలో చైనా గ్రామాన్ని నిర్మించింది. ఈ ప్రదేశాన్ని భారత్ సార్వభౌమత్వాన్ని గుర్తించబోమని పేర్కొంది. నేపాల్, భూటాన్‌లతో కూడా ఇలానే వ్యవహరిస్తోంది. ఒకవేళ సరిహద్దుదేశాలు సైనిక చర్యలకు దిగితే పౌరులపై సైనిక దాడులంటూ చూపించడానికి.. ఈ కుట్రలు చేస్తోంది చైనా.
భారత్, భూటాన్, నేపాల్ సరిహద్దుల్లోనే కాదు.. దక్షిణ చైనా సముద్రంలో ఇలాంటి వ్యూహమే అమలు చేసింది. చడీచప్పుడు లేకుండా అక్కడ కృత్రిమ దీవులను నిర్మించింది. ఇప్పుడు ఈ ప్రాంతమంతా తమ ప్రాదేశిక జలాలుగా చెబుతోంది. ఇందుకోసం మత్స్యకారుల్ని రంగంలో దింపింది. వీరికి చైనా కోస్టుగార్డు రక్షణ ఇస్తోంది. ఇదే వ్యూహంతోనే.. ఇప్పుడు హిమాలయాల్లో కృత్రిమ గ్రామాలను నిర్మిస్తోంది చైనా. జపాన్ టైమ్స్ పత్రికలో వచ్చిన ఈ కథనంతో.. చైనా వ్యూహం తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com