Chenab Bridge : చీనాబ్‌పై చైనా కుట్ర.. రంగంలోకి పాక్ ఇంటలిజెన్స్

జమ్మూ కాశ్మీర్లో అత్యంత ఎత్తులో నిర్మించిన వంతెనపై పాకిస్తాన్ కళ్లు పడ్డాయి. జమ్మూలోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ గా ఈ వంతెన నిలవనుంది. ఈ ఎత్తైన వంతెనకు సంబంధించిన సమాచారాన్ని పొరుగు దేశం సేకరించే పనిలో పడినట్లు భారత్ కు సమాచారం చేరవచ్చింది. వంతెనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పాక్, చైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు సేకరిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఆ వివరాలు ఎందుకు తెలుసుకుంటున్నారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. చీనాబ్ రైలు వంతెనను భారతీయ రైల్వే శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఉక్కు, కాంక్రీట్ తో నిర్మించిన ఈ వంతెన.. జమ్మూకాశ్మీర్ లోని జమ్మూ డివిజన్ రియాసీ జిల్లా బక్కల్ - కౌరీ మధ్య ఉంది. కశ్మీర్ ను భారత్లోని మిగతా ప్రాంతాలతో కలిపేందుకు చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. ఈ వంతెనను నిర్మించేందుకు భారత ప్రభుత్వానికి 20 ఏళ్ల సమయం పట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com