మ‌రో అన‌ర్థానికి కారణమవుతున్న చైనా.. మగవారి అంగం సైజు త‌గ్గుతోంద‌ట‌..!

మ‌రో అన‌ర్థానికి కారణమవుతున్న చైనా.. మగవారి అంగం సైజు త‌గ్గుతోంద‌ట‌..!
China: గత ఏడాది కరోనా మహమ్మారిని ప్రపంచ దేశాల మీదకి వదిలింది చైనా. ఈ వైరస్ చైనాలోని వ్యూహాన్ ల్యాబ్ నుంచి లీకైందనే వార్తలు కూడా వచ్చాయి.

చైనా గత ఏడాది కరోనా మహమ్మారిని ప్రపంచ దేశాల మీదకి వదిలింది. ఈ వైరస్ చైనాలోని వ్యూహాన్ ల్యాబ్ నుంచి లీకైందనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే అనేక దేశాలు ఈ మహమ్మారి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ అర్థిక వ్యవస్థపై కూడా కరోనా ప్రభావం పడింది. ఈ విషయం అలా ఉంచితే.. చైనా మరో అనర్థానికి కూడా కారణం అని తేలిపోయింది. ఆ దేశం వదిలే కాలుష్యం వ‌ల్ల మగవారిలో అంగం సైజు క్రమంగా త‌గ్గిపోతున్నద‌ంట‌. ప్రపంచ దేశాల్లో అత్యధిక కాలుష్యం వదిలే దేశంగా చైనా ముందుంటుంది. చైనాలోని కెమికల్, ఫార్మా పరిశ్రమ‌ల నుంచి వ్యర్థ ర‌సాయ‌నాల‌ను స‌ముద్రాల్లోకి వ‌దులుతున్నది.

ఆదేశం రసాయనాలను సుముద్రంలోకి వదలడం ద్వారా సముద్ర జలాల్లో కాలుష్యం పెరుగుతున్నది. దాంతో ప్రపంచలో ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ అధిక కాలుష్యం, అధిక ఉష్ణోగ్రత‌లవ‌ల్ల మానవ శరీరంపై ప్రత్యక్ష ప్రభావం పెరిగిపోతున్నద‌ని నిపుణులు అంటోన్నారు. కాలుష్యం కార‌ణంగా భూతాపం పెరిగి వాతావరణంలో ప‌లు మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాదు దాని ద్వారా పర్యావరణం నాశనమ‌య్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు.

ఈ విషయాలన్ని ప్రముఖ మ‌హిళా పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ షన్నా స్వాన్.. కౌంట్ డౌన్ అనే బుక్ లో పేర్కొన్నారు. ఆ పుస్తకంలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన‌, ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యాలు తెలిపారు. మన ఆధునిక ప్రపంచం స్పెర్మ్ కౌంట్‌ను, స్త్రీ, పురుష పునరుత్పత్తి అభివృద్ధిని, మానవ జాతి భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని డాక్టర్ ష‌న్నా స్వాన్ త‌న‌ కౌంట్ డౌన్ పుస్తకంలో పేర్కొన్నారు. కాలుష్యం కారణంగా మానవ పురుషాంగం పరిమాణం క్రమంగా తగ్గుతుందట.ప్లాస్టిక్ రేణువుల్లోని థాలెట్ అనే మూలకంవ‌ల్ల సంతానోత్పత్తి రేటు తగ్గడంతోపాటు.. థాలేట్ అనేది ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే రసాయనం.. హార్మోన్‌ను ఉత్పత్తి చేసే ఎండోక్రైన్ వ్యవస్థను ప్రభావితం చేస్తుందట‌.

ఎలుకలపై జరిపిన తన తాజా పరిశోధనల్లో థాలేట్ సిండ్రోమ్‌ను పరిశీలించినట్లు షన్నా స్వాన్ తెలిపారు. థాలెట్ కెమికల్ కారణంగా రానురాను శిశువులు కుంచించుకుపోయిన జననేంద్రియాలతో పుట్టే అవకాశం ఉందని ఆ ప‌రిశోధ‌న‌లో తేలిన‌ట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే జననేంద్రియాలు పూర్తిగా పనిచేయవని ఉంది. వీటంన్నికి ప్రధాన కారణం చైనా వదలిన కాలుష్యం అని ఆమె తన పుస్తకంలో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story