China Population : 'చైనా జనాభా డౌన్ .. పడిపోయిన పాపులేషన్

China Population : చైనా జనాభా డౌన్ .. పడిపోయిన పాపులేషన్
X

చైనా జనాభా వరుసగా మూడో ఏడాది కూడా పడిపోయింది. ఫలితంగ వృద్దుల సంఖ్య పెరుగుతోంది. 2024 సంవత్సరం చివరి నాటికి చైనాలో 140.8 కోట్ల జనాభా ఉంది. అంతక్రి తం ఏడాది (2023)తో పోలిస్తే 13.90 లక్షల మేర జనాభా తగ్గిపోయింది. ఈ గణాంకాలను స్వయంగా చైనా ప్రభుత్వమే ఇవాళ విడుదల చేసింది. చైనాలో ప్రజల జీవన వ్యయాలు బాగా పెరిగాయి. దీంతో చాలామంది యువత త్వరగా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. సరైన ఆదాయాలు లేకపోవడంతో పెళ్లయిన వారు ఎక్కువ మంది పిల్లల్ని కనే సాహసం చేయడం లేదు. చైనాలోని వృద్ధుల సగటు ఆయుర్దాయం బాగా పెరిగింది. ఐదింట ఒకవంతు లేదా 22 శాతం మంది (31.30 కోట్లు) 60 ఏళ్లకు పైబడిన వారే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2035 నాటికి ఈ వయో వర్గంలోని వారి సంఖ్య జనాభాలో 30 శాతానికి మించుతుందనే అంచనాలు వె లువడుతున్నాయి. 2023తో పోలిస్తే 2024లో చైనాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి దాదాపు కోటి మంది పట్టణాలు, నగరాలకు వలస వెళ్లినట్లు నివేది కలో ప్రస్తావించారు. చైనాలో పట్టణీకరణ రేటు 67 శాతంగా ఉందన్నారు.

Tags

Next Story